Gottipati ravi kumar: విద్యుత్‌శాఖలో జగన్‌ రూ. 1. 25 లక్షల కోట్ల అప్పు.. వ్యవస్థను నాశనం చేశారు: మంత్రి గొట్టిపాటి

Gottipati ravi kumar: విద్యుత్‌శాఖలో జగన్‌ రూ. 1. 25 లక్షల కోట్ల అప్పు.. వ్యవస్థను నాశనం చేశారు: మంత్రి గొట్టిపాటి

Play all audios:


దేశ భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతుంటే, రాష్ట్రం బాగు కోసం జగన్‌కు మాత్రం మనసు రావట్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మండిపడ్డారు. అమరావతి: దేశ భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతుంటే.. రాష్ట్రం బాగు


కోసం మాజీ సీఎం జగన్‌కు మాత్రం మనసు రావట్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ (Gottipati Ravi Kumar) మండిపడ్డారు. సొంత మీడియా ద్వారా జగన్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు


ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించరన్నారు.  వైకాపా ప్రభుత్వం పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ను యూనిట్‌కు రూ.9.38కు కొనుగోలు చేసిందని చెప్పారు. పీక్‌ అవర్స్‌లోనూ తమ ప్రభుత్వం రూ.4.60కే విద్యుత్‌


కొనుగోలు చేస్తోందని వివరించారు. జగన్‌ ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్‌ను రూ.5.12కు కొనేందుకు ఒప్పందం చేసుకుందని.. సెకీ నుంచి రూ.2.49కు కొనుగోలు చేసిందనేది అవాస్తవమని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర


ప్రభుత్వం చేసుకున్న యాక్సిన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ- బ్రూక్‌ ఫీల్డ్‌ ఒప్పందంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. యాక్సిన్‌-బ్రూక్‌ ఫీల్డ్‌ సంస్థ రైతుల నుంచి 1,700 ఎకరాలు లీజు తీసుకుంటుంది. ఎకరాకు


రూ.31 వేలు లీజు చెల్లించేలా ఒప్పందం జరిగింది. ప్రతి రెండేళ్లకు లీజును 5 శాతం పెంచేలా ఒప్పందం కుదిరింది. గతంలో విద్యుత్‌ శాఖపై రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసి జగన్‌ నాశనం చేశారు. గత ప్రభుత్వం


పెంచిన ఛార్జీలను ప్రజలు ఇప్పటికీ చెల్లించాల్సి వస్తోంది’’ అని గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. (Andhra Pradesh News)