
Srisailam tour: శ్రీశైలం వెళ్తే మాత్రం.. ఈ ప్లేస్ అస్సలు మిస్ కావొద్దు..
Play all audios:

Reported by: Published by: Last Updated:December 17, 2024 8:09 AM IST ఈ పార్కును ఇంకా ఎంతగానో అభివృద్ధి చేస్తామని, ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ఈ పార్కును ఉంచామని, స్నేక్ రెస్క్యూ మీద అవగాహన
కొరకు స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తామని పెద్దన్న తెలిపారు. X SRISAILAM శ్రీశైలం మహా క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా పర్యాటక ప్రాంతంగాను ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ
శ్రీశైలంలో చూడదగిన ప్రదేశాలు అయిన మఠాలు, గుడులు, పార్కులు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా పర్యాటకులు సందర్శించే ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన.. ఏకోలాజికల్ నాలెడ్జ్ పార్క్ భక్తులకు,
స్థానికులకు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఆది మానవుల నుంచి ప్రస్తుత మానవుని వరకు అంచలంచెలుగా ఎలా ఎదిగారనేది బొమ్మల ద్వారా కళ్ళకు కట్టినట్టు ఎకోలాజికల్ పార్క్లో
చూపిస్తారు. హ్యూమన్ ఎవల్యూషన్ ఏ కాకుండా యానిమల్ ఎవల్యూషన్ కూడా ఉంటుంది. డైనోసార్ కాలం నుంచి మనకు ఏ ఏ జంతువులు ఉన్నాయి, వాటి జాతులు అన్ని మనకు లిఖిత పూర్వకంగా, బొమ్మల ద్వారా చూపిస్తారు. భూమి
ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏర్పడు వాల్కనో, లావా ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ చూపించారు. అదే కాకుండా మన భూమి ఏ విధంగా అయితే ఏర్పడింది, ఏ స్థితిలో నుంచి భూమి ఏ స్థితిలోకి
ఎలా మారింది అనే విషయాలపై ఫారెస్ట్ అధికారులు చక్కటి బొమ్మలతో వర్ణిస్తారు. ఇవే కాకుండా అడ్వాన్చర్ రైడ్, ఆర్చరీ, జంగిల్ సఫారీ వంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇందులో ప్రవేశించడానికి
పిల్లలకు 30 రూపాయలు, పెద్దవారికి 50 రూపాయలు చొప్పున టికెట్ రుసుము ఉంటుంది. advertisement భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం చూడదగిన ప్రదేశమైనటువంటి ఎకో నాలెడ్జ్ పార్క్
కచ్చితంగా సందర్శించి వెళ్తారు. ఈ ఎకో నాలెడ్జ్ పార్క్ ప్రధాన ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం టు హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మరెన్నో ఈ పార్క్లో వీక్షకులకు
కనిపిస్తాయి. సెక్షన్ ఆఫీసర్ పెద్దన్న లోకల్ 18 తో మాట్లాడుతూ ఈ పార్కును ఇంకా ఎంతగానో అభివృద్ధి చేస్తామని, ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ఈ పార్కును ఉంచామని, స్నేక్ రెస్క్యూ మీద అవగాహన కొరకు స్నేక్
అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తామని పెద్దన్న తెలిపారు. Location : Nandyal,Kurnool,Andhra Pradesh First Published : December 17, 2024 8:09 AM IST Read More