
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu
Play all audios:

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (14-06-2025) వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా
వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. ఈవారం (08-06-2025 - 14-06-2025) గురుగ్రహ అనుగ్రహంతో ప్రారంభించిన పనులు సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని
వాటిని అమలు చేయండి. చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది, అవసరాలకు ధనం చేకూరుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంది. ధనాన్ని
పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది. వస్తు, వస్త్ర ప్రాప్తి లభిస్తుంది. గృహ, వాహనాది యోగాలు శుభ ఫలితాన్నిస్తాయి. భూమి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు
సాగండి. ఎవరి మాటలు లోతుగా మనసుకు తీసుకోవద్దు, చంచలత్వంతో ఏ పని చేయవద్దు. సద్భావనతో ముందుకు సాగాలి. మిత్రుల సహకారం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో విభేదించకుండా వారి సూచనలను పాటించండి. మేలు
చేకూరుతుంది. కాలం మిశ్రమంగా ఉంది. కాబట్టి పరిస్థితులను సరిగ్గా అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా ముందుకు సాగండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ఎక్కువ శాతం మౌనంగా ఉండాలి. త్వరగా ఆపదల నుంచి
బయటపడతారు. విజయం సాధిస్తారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మంచిది.