
Ap polycet results: ఏపీ పాలిసెట్‌లో 19మందికి 120/120 మార్కులు.. ‘గోదావరి’ విద్యార్థులదే హవా
Play all audios:

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. By Features Desk Updated : 14 May 2025 19:57 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 2 min read ఫలితాల కోసం క్లిక్ చేయండి AP Polycet
Results| ఇంటర్నెట్ డెస్క్: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా
లోకేశ్(Nara Lokesh) విడుదల చేశారు. ఏపీ పాలిసెట్‌లో 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించి అదరగొట్టారు. ఈ విద్యార్థుల అపూర్వ విజయాన్ని మంత్రి లోకేశ్ అభినందించారు. వారి అద్భుతమైన
కృషి, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఈ ఏడాది పాలిసెట్‌లో మొత్తంగా 95.36శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 98.66శాతం ఉత్తీర్ణత
నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. ఈసారి మొత్తంగా 1,39,840 మంది పాలిసెట్ రాయగా.. వీరిలో 1,33,358 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు
తెలిపారు. (AP Polycet 2025 Results) * ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల పాలిసెట్‌లో గోదావరి విద్యార్థుల హవా.. ఏపీ పాలిసెట్ ఫలితాల్లో 120కి 120 మార్కులు సాధించిన 19మంది
విద్యార్థుల్లో ఐదుగురు అమ్మాయిలు కాగా.. మిగతా వారంతా అబ్బాయిలే. వీరిలో 15మంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే ఉండటం విశేషం. అలాగే, విశాఖ నుంచి ఇద్దరు, కాకినాడ, ప్రకాశం జిల్లాలకు చెందిన
ఒక్కొక్కరు ఉన్నారు. ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి టాపర్లు వీరే.. బి. శశివెంకట్ (తూ.గో జిల్లా), బాలినేని కల్యాణ్ రామ్ (విశాఖ), మెర్ల జేఎస్‌ఎన్‌వీ చంద్రహర్ష (తూ.గో),
బొడ్డేటి శ్రీకర్ (ప.గో జిల్లా), వరుణ్‌తేజ్ (తూ.గో), వి. ప్రవళిక (ప.గో), ఆకుల నిరంజన్ శ్రీరామ్ (తూ.గో), చింతాడ చోహాన్ (విశాఖ), కోదాటి కృష్ణ ప్రణయ్ (ప.గో), బి.రక్షిత శ్రీ స్వప్న (తూ.గో),
ఆర్. చాహ్న (తూ.గో), పాల రోహిత్ (ప.గో), యు.చక్రవర్తుల శ్రీ దీపిక (ప.గో), చలువాది ఖాధిరేశ్ (ప్రకాశం), కొప్పిశెట్టి అభిజిత్ (కాకినాడ), పి. నితీశ్ (ప.గో), వై.హేమచంద్రకుమార్ (తూ.గో), ఎ.
యశ్వంత్ పవన్ సాయిరామ్ (ప.గో), ఎం. ఉమా దుర్గ శ్రీనిధి (తూ.గో) (AP Polycet toppers list) రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 30న AP Polycet 2025 పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
అండ్ ట్రైనింగ్ (SBTET) అధికారులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫైనల్ కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్
పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.