
Upsc prelims e-admit cards: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు విడుదల
Play all audios:

అఖిల భారత సర్వీసుల్లో అధికారుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 25న నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. By Features Desk Published : 14
May 2025 18:37 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో అధికారుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 25న నిర్వహించే
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. 979 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి జనవరి 22 నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షకు సమయం దగ్గర
పడుతుండటంతో అడ్మిట్ కార్డుల్ని అధికారులు డౌన్‌లోడ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరగనున్న వేళ తాజాగా యూపీఎస్సీ ఈ-అడ్మిట్ కార్డులను జారీ చేసింది. ఈ కార్డులు మే
25 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ-అడ్మిట్ కార్డును తుది ఫలితాలు వెలువడే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా
కోడ్ ఎంటర్ చేయడం ద్వారా అడ్మిట్‌కార్డును పొందొచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ-అడ్మిట్ కార్డుల
కోసం క్లిక్ చేయండి గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర
ప్రత్యుత్తరాలకి తావు లేదు._