Govindappa balaji: గోవిందప్ప బాలాజీకి ఈనెల 20 వరకు రిమాండ్‌

Govindappa balaji: గోవిందప్ప బాలాజీకి ఈనెల 20 వరకు రిమాండ్‌

Play all audios:


విజయవాడ: ఏపీ మద్యం కేసలో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. దీంతో గోవిందప్పను  అధికారులు విజయవాడ జైలుకు తరలించారు.  వైకాపా హయాంలో


జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి ‘అంతిమ లబ్ధిదారు’కు చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించిన భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌


గోవిందప్ప బాలాజీని సిట్‌ అరెస్టు చేసింది. ఈ కేసులో 33వ నిందితుడి (ఏ33)గా ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారు. నెల


రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి


అక్కడే మాటు వేశాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్‌నెస్‌ సెంటర్‌ బయట ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి.