
Narayana: అమరావతికి మరో 10వేల ఎకరాలు కావాలి: మంత్రి నారాయణ
Play all audios:

అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి మరో 10వేల ఎకరాల భూమి అవసరమని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. కాలుష్య రహిత పరిశ్రమలకు 2,500 ఎకరాలు సమకూర్చాల్సి ఉందన్నారు. విమానాశ్రయానికి 5వేల ఎకరాలు,
స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు అవసరమవుతుందన్నారు. క్రెడాయ్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. అమరావతిలో ఏడాదిలోగా 4వేల మంది అధికారుల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు
తీసుకుంటామన్నారు. ఏడాదిన్నరలో రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఐకానిక్ భవనాలు మూడేళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.