Us markets crash: అమెరికా మార్కెట్లూ అతలాకుతలం.. బేర్‌ గుప్పిట్లోకి s&p 500

Us markets crash: అమెరికా మార్కెట్లూ అతలాకుతలం.. బేర్‌ గుప్పిట్లోకి s&p 500

Play all audios:


US markets crash | వాషింగ్టన్‌: అమెరికా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటన మూలంగా గత వారాంతంలో భారీ నష్టాల మూటగట్టుకున్న సూచీలు.. వరుసగా మూడో రోజూ అదే


బాటలో పయనిస్తున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలో ప్రధాన సూచీలైన ఎస్‌అండ్‌పీ 500.. 4.23 శాతం మేర కుంగింది. కొవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. డోజోన్స్‌ కూడా 1400 పాయింట్ల మేర పతనం


కాగా.. నాస్‌డాక్‌ 4.55 శాతం క్షీణించి 700 పాయింట్ల మేర పడిపోయింది. ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై టారిఫ్‌లు విధించడంతో అమెరికా సహా ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. నేడు భారత్‌  


సహా దాదాపు అన్ని మార్కెట్లూ గట్టి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సుంకాలు, ప్రతి సుంకాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని, మాంద్యం పరిస్థితులు తలెత్తాయని ఆర్థికవేత్తలు ఆందోళన


వ్యక్తంచేస్తున్నప్పటికీ.. ట్రంప్‌ మాత్రం తన చర్యలను సమర్థించుకుంటున్నారు. నాస్‌డాక్‌ శుక్రవారమే బేర్‌ మార్కెట్‌లోకి ఎంటర్‌ అయ్యింది. రికార్డు గరిష్ఠాల నుంచి 22 శాతం మేర పతనం అయ్యింది.


ఇప్పుడు ఎస్‌అండ్‌పీ 500 సూచీ కూడా నేడు బేర్‌ మార్కెట్‌లోకి ఎంటర్‌ అయ్యింది. * వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచిన కేంద్రం సాధారణంగా ఏదైనా సూచీ రికార్డు గరిష్ఠాల నుంచి 20 శాతం మేర పతనం అయితే


దాన్ని బేర్‌ మార్కెట్‌లోకి వెళ్లినట్లు పరిగణిస్తారు. మరోవైపు అమెరికాలోని ప్రధాన స్టాక్స్‌ అన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా 9 శాతం, చిప్‌ల తయారీ కంపెనీ


ఎన్విడియా 7 శాతం, మెటా 4.5 శాతం, అమెజాన్‌ 4 శాతం, నెట్‌ఫ్లిక్స్‌ 3.4 శాతం, గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ 3 శాతం, యాపిల్‌ 6 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి.