Flipkart: క్విక్‌ కామర్స్‌, ఫిన్‌టెక్‌పై ఫోకస్‌.. ఈ ఏడాదిలో 5 వేల నియామకాలకు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్‌

Flipkart: క్విక్‌ కామర్స్‌, ఫిన్‌టెక్‌పై ఫోకస్‌.. ఈ ఏడాదిలో 5 వేల నియామకాలకు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్‌

Play all audios:


Flipkart: ఈ ఏడాదిలో కొత్తగా 5 వేల మందిని నియమించుకొనేందుకు వాల్‌మార్టుకు చెందిన ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధమైంది. Flipkart | ఇంటర్నెట్‌ డెస్క్‌: వాల్‌మార్ట్‌కు చెందిన ఇ-కామర్స్‌


దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనుంది. ఈ ఏడాది 5,000 మందిని నియమించుకొనేందుకు సిద్ధమవుతోంది. క్విక్‌ కామర్స్‌, ఫిన్‌టెక్, కృత్రిమ మేధ (AI) రంగాల్లో విస్తరణపై


దృష్టి సారించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సీమా నాయర్‌ ఈ నియామక ప్రణాళికలను ప్రకటించారు.


‘మినిట్స్‌’ పేరిట క్విక్‌ కామర్స్‌ సేవలు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. దీని ద్వారా వినియోగదారులకు వేగవంతమైన డెలివరీ సేవలు అందించేందుకు కృషి చేస్తోంది.


యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్‌ జరిపేందుకు సూపర్‌.మనీ (Super.money) పేరుతో తీసుకొచ్చిన అప్లికేషన్‌పై దృష్టి సారించింది. ఈ విభాగాల్లో డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో నూతన


నియామకాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ చర్య కంపెనీ అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తోంది. * మధ్య స్థాయి కంపెనీలకు డిజిటల్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ  భారత మార్కెట్లో తన స్థానాన్ని


బలోపేతం చేసుకొనేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఫ్యాషన్‌ రంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లోనూ దూకుడుగా పెట్టుబడుల్ని పెడుతోంది. ఈ ఏడాదిలో ఏఐపై పెట్టుబడులు ఆరు


రెట్లు పెరిగాయి. మరోవైపు పబ్లిక్‌ ఇష్యూ (IPO) కోసం సిద్ధమవుతున్న ఫ్లిప్‌కార్ట్‌ తన హోల్డింగ్‌ కంపెనీని సింగపూర్‌ నుంచి భారత్‌కు తరలించాలని భావిస్తోంది.