
Upi services: ఏప్రిల్ 1 నుంచి ఈ నంబర్లకు యూపీఐ సేవలు బంద్.. యూజర్లేం చేయాలి?
Play all audios:

UPI services | ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే
ప్రొవైడర్లకు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. యూపీఐ
వినియోగంలో మొబైల్ నంబర్ కీలకం. ఈ సేవల్లో ఓటీపీ వెరిఫికేషన్ కీలక భూమిక పోషిస్తుంది. అందుకే ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కువకాలం పాటు వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు
వేరొకరికి కేటాయిస్తుంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు మనం వాడే నంబర్లు వేరొకరికి చేరుతుంటాయి. దాంతో యూపీఐ ఖాతాలు కూడా వారి చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల అనధికారిక, మోసపూరిత లావాదేవీలు
జరిగే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు ఎన్‌పీసీఐ ఆదేశాల మేరకు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్‌తో పాటు బ్యాంకులు ఇన్‌యాక్టివ్ నంబర్లను తొలగించనున్నాయి. * యూపీఐ మోసాలకు చెక్..
రిక్వెస్ట్ పంపే పద్ధతికి స్వస్తి ఏం చేస్తారు? ఇన్‌యాక్టివ్‌లో ఉన్న, ఇతరులకు అసైన్ చేసిన, డీయాక్టివ్ చేసిన మొబైల్ నంబర్లు బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లు తొలగిస్తాయి. ఒకవేళ అందులో మీ
నంబర్ ఉంటే.. యూపీఐ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్ పంపిస్తాయి. నోటిఫికేషన్ తర్వాత కూడా నంబర్ ఇన్‌యాక్టివ్‌లోనే ఉంటే మోసాలను అరికట్టేందుకు యూపీఐ నంబర్లను బ్యాంకులు డీలిస్ట్
చేస్తాయి. ఎవరిపై ప్రభావం? * మొబైల్ నంబర్ మార్చినా బ్యాంకుల వద్ద ఆ నంబర్‌ను అప్‌డేట్ చేయని వారి మీద ప్రభావం ఉంటుంది. * యూపీఐతో లింక్ చేసి కాల్స్, ఎస్సెమ్మెస్‌లు వంటివేవీ చేయకుండా
దీర్ఘకాలం పక్కనపెట్టిన వారు * బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేయకుండా మొబైల్ నంబర్‌ను సరెండర్ చేసినవారు అవాంతరాలు ఎదుర్కొంటారు. * పాత నంబర్‌ను వేరొకరికి అసైన్ చేసిన సందర్భాల్లో పాత నంబర్
హోల్డర్లపై ఈ ప్రభావం ఉంటుంది. యూపీఐని యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే? * మీ నంబర్ యాక్టివ్‌గా ఉందో, లేదో చెక్ చేసుకోండి. కాల్స్, మెసేజులు వెళ్తున్నాయో, లేదో చూడండి. * బ్యాంక్ నుంచి ఓటీపీలు,
ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు వస్తున్నాయో, లేదో చెక్ చేసుకోండి. * బ్యాంకుల వద్ద మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోండి. నెట్‌బ్యాంకింగ్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఈ ప్రక్రియను
పూర్తి చేయొచ్చు.