
X down: ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం.. యాప్, వెబ్‌సైట్లో సమస్య
Play all audios:

X Down: ఎలాన్ మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమం ఎక్ష్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిపై యూజర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. X Down | ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్‌కు చెందిన సామాజిక
మాధ్యమం ఎక్స్‌లో సాంకేతిక సమస్య (X down) తలెత్తింది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ సమస్య ప్రారంభమైనట్లు డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. ఎక్స్ వెబ్‌సైట్, యాప్‌లో కొత్త పోస్టుల
కోసం రీఫ్రెష్ చేసినప్పుడు ‘సమ్‌థింగ్ వెంట్ రాంగ్, ట్రై రీలోడింగ్’ అని సందేశం చూపిస్తోంది. శుక్రవారం సైతం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. శుక్రవారం నాటి
అంతరాయంపై ఎక్స్ ఇంజినీర్లు అధికారికంగా వివరణ ఇచ్చారు. డేటా సెంటర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య మూలంగా ఈ పరిస్థితి నెలకొందని వివరించారు. ఈ కారణంగా కొందరు యూజర్లకు లాగిన్, సైనప్ సేవల్లో
అవాంతరాలు ఏర్పడొచ్చని పేర్కొన్నారు. నోటిఫికేషన్లు, ప్రీమియం ఫీచర్లలో కొంత ఆలస్యం జరగొచ్చని తెలిపారు. నేడు కూడా ఇదే తరహా సమస్య తలెత్తడంపై ఎక్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. వరుసగా
రెండో రోజూ ఇదే పరిస్థితి నెలకొనడంతో యూజర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు.