
Yamaha: యమహా ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్
Play all audios:

Yamaha: భారత్‌లో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యమహా 5 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. Yamaha | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ
ఇండియా యమహా ప్రైవేట్ లిమిటెడ్ తన కస్టమర్ల కోసం సరికొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. భారత్‌లో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. కస్టమర్ సర్వీస్
విస్తరణలో మరో అడుగు ముందుకేస్తూ.. రూ.975తో ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. వాహనాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినా, ప్రమాదాలు, బ్యాటరీ వైఫల్యాలు, టైర్లు పగిలిపోవడం,
చిన్న మరమ్మతులు వంటి అనేక అత్యవసర పరిస్థితులను ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు టోయింగ్ సర్వీస్, ఆన్- సైట్ రిపేర్ సపోర్ట్ సహాయాన్ని పొందొచ్చు.
దేశవ్యాప్తంగా 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఈ రోడ్‌సైడ్ అసిస్టెన్స్.. యమహా ఇటీవల 10 సంవత్సరాల వారంటీ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 2 ఏళ్ల సాధారణ
వారెంటీ, 8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారెంటీ ఇమిడి ఉంటాయి.