
Crime news: నకిలీ విలేకర్ల ముఠా హల్‌చల్.. సీఐకే టోకరా..
Play all audios:

నల్గొండ జిల్లాలో నకిలీ విలేకర్ల ముఠా (Crime News) హల్‌చల్ చేసింది. ఈ ముఠా సభ్యులు కొంత కాలంగా పోలీసులే లక్ష్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నల్గొండ: నల్గొండ జిల్లాలో నకిలీ విలేకర్ల
ముఠా (Crime News) హల్‌చల్ చేసింది. ఈ ముఠా సభ్యులు కొంత కాలంగా పోలీసులే లక్ష్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమాలు బయట పెడతామంటూ వారినే బెదిరించారు. ఈ క్రమంలో ఓ సీఐని బెదిరించి రూ.5
లక్షలు డిమాండ్ చేశారు. వారి ఆగడాలు తట్టుకోలేక ఆయన రూ.1.10 లక్షలు చెల్లించారు. (Telangana News) మరో రూ.4 లక్షలు ఇవ్వాలంటూ సీఐ కుటుంబాన్ని దుండగులు వేధింపులకు గురిచేశారు. దీంతో
ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ముఠా సభ్యుల కోసం గాలింపు చేపట్టారు.