
Nagarkurnool: ప్రియురాలిని చూడటానికి రాత్రి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. బంధువులు చూసి ఏం చేశారంటే..?
Play all audios:

Published by: Last Updated:June 12, 2022 12:13 PM IST ఈనెల 5న నాగర్‌కర్నూల్‌లో చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్రియురాలి కోసం శివ అదే రాత్రి ఆ ఇంటికి వెళ్లాడు. దీంతో యువతి కుటుంబ
సభ్యులు, బంధువులు గమనించారు. ప్రియురాలి (Girlfriend) కోసం వచ్చిన ప్రియుడిని (Boyfriend) యువతి బంధువులు కొట్టడంతో ఆ యువకుడు దుర్మరణం (Died) పాలయ్యాడు. నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లాలో
ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన . నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని దాదామోని శివ (18) కొంతకాలంగా అచ్చంపేట మండలం చవుట పల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. కాగా, ఈనెల 5న తెలకపల్లి మండలం
కమ్మారెడ్డిపల్లిలోని చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్రియురాలి కోసం శివ అదే రాత్రి ఆ ఇంటికి వెళ్లాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు (Girlfriend Relatives) గమనించి యువకుడిని
కొట్టారు (Beaten brutally). అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడి శివ అక్కడ్నుంచి ఇంటికి వచ్చాడు. గాయాలు ఎక్కువగా ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ లోని జనరల్ ఆస్పత్రికి బాధితుడిని
తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసు కెళ్లారు. అక్కడే చికిత్స పొందు తూ ఈనెల 9న మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం అతని తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే దాడి చేశారని కేసు పెట్టేందుకు వెళ్లిన శివపైనే కేసు (case) నమోదు చేసి జైలుకు పంపిస్తానని ఎస్‌ఐ బెదిరించినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాడిలో దెబ్బలకు తాళలేక మంచినీళ్లు ఇవ్వాలని
కోరిన శివకు ప్రియురాలి బంధువులు పురుగుమందు తాగించారని ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆరోపించడంతో కలకలం రేగింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ వద్దకు పంచాయితీ.. అయితే ప్రియురాలి
బంధువులు (Girlfriend Relatives) శివను పథకం ప్రకారమే హత్య చేశారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని తెలకపల్లి పోలీసులను ఆశ్రయించిన యువకుడి తల్లిదండ్రులను అక్కడి ఎస్‌ఐ
బెదిరించారని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎస్పీ మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. advertisement SHIVA తమ కుమార్తెను వదిలిపెట్టాలని.. ఇలాంటి ఘటనే ఇటీవల జరిగింది. రంగారెడ్డి జిల్లా
మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23) ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరైనప్పటికీ.. ఒకరంటే మరొకరికి చచ్చేంత
ఇష్టం. ఏడేళ్లుగా వీరిప్రేమాయణం సాగుతోంది. ఇంట్లో దీని గురించి తెలియడంతో ఆశ్రిన్ కుటుంబ సభ్యులు నాగరాజుకు వార్నింగ్ ఇచ్చారు. తమ కుమార్తెను వదిలిపెట్టాలని హెచ్చరించారు. కానీ వారు మాత్రం
వినలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐతే అంతకంటే ముందు ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకున్నాడు. advertisement అనంతరం హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతంలో ఓ కార్ల షోరూంలో సేల్స్‌మ్యాన్‌గా
చేరాడు. ఈ ఏడాది జనవరి 1న అశ్రిన్‌ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు..తనకు ఉద్యోగం వచ్చిందని, త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఈ క్రమంలోనే జనవరి చివరి వారంలో ఆశ్రిన్ ఇంటి నుంచి పారిపోయి
హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత లాల్ దర్వాజ ఆర్యసమాజ్‌లో జనవరి 31న వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆశ్రిన్ ఇంటి నుంచి ముప్పు ఉంటుందని నాగరాజుకు తెలుసు. అందుకే తమను ఎవరూ గుర్తించకుండా
నాగరాజు వేరే ఉద్యోగంలోకి మారిపోయాడు. వీరిద్దరు హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలియడంతో.. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లిపోయారు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నారు. తమ
కోసం ఎవరూ వెతకడం లేదని నిర్ధారించుకున్న తర్వాత.. ఐదు రోజు క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సరూర్ నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరు హైదరాబాద్‌కు వచ్చిన
విషయం ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇద్దరి కదలికలను గుర్తించి.. మాటువేశారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్ ఇంటి నుంచి బయటకు వచ్చారు.బైక్‌పై వెళ్తుండగా జీహెచ్ఎంసీ రోడ్డు
ప్రాంతంలో ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. అనంతరం గడ్డపారతో దాడి చేసి హత్య చేశాడు. తీవ్ర గాయాలతో నాగరాజు స్పాట్‌లోనే మరణించాడు. Location : First Published : June 12, 2022 9:38 AM IST Read
More