
Helicopter crash: కూలిన హెలికాప్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి
Play all audios:

ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. అధికారులు
తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది (Helicopter Crash). గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన
వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలీకాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు, సహాయక సిబ్బంది
ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.