Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. పాక్‌ డ్రోన్లను కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. పాక్‌ డ్రోన్లను కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

Play all audios:


ఇంటర్నెట్ డెస్క్‌: భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్థాన్‌ తెగబడుతోంది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదంపై పోరు తలపెట్టిన


భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు పాకిస్థాన్‌ దాడులకు దిగింది. అందులోభాగంగా జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్, పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ఉపక్రమించింది. అయితే, భారత సైన్యం వాటిని


సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనిపై భారత ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఉధంపుర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పాక్‌ దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ


కూల్చేసింది. జైసల్మేర్‌లోనూ డ్రోన్లతో పాక్‌ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.   ‘‘డ్రోన్లు, పలు ఆయుధాలతో భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్‌ బలగాలు దాడులు చేశాయి. గురువారం రాత్రి


నుంచి జమ్మూకశ్మీర్‌ ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాక్‌ డ్రోన్ల దాడులను సమర్థంగా తిప్పికొట్టి ధ్వంసం చేశాం. ప్రజల భద్రత, దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు భారత ఆర్మీ ఎల్లవేళలా


కట్టుబడి ఉంది. పాక్‌ దుర్మార్గపు కుట్రలకు సత్వరం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని భారత సైన్యం వెల్లడించింది. సైనిక కేంద్రాలే లక్ష్యంగా పాక్‌ దాడులు జమ్మూ విమానాశ్రయం, సైనిక కేంద్రాలే


లక్ష్యంగా పాకిస్థాన్‌ దాడులు చేస్తోంది. పాక్‌ డ్రోన్లు, మూడు యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. రాజస్థాన్‌లోని రామ్‌గర్, జైసల్మేర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంపులపై పాక్‌ దాడులను భారత


రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. జమ్ముకశ్మీర్‌లోని పౌరుల వాహనాలే లక్ష్యంగానూ ఈ దాడులు చేస్తోంది.