Tej pratap yadav: నా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది.. రిలేషన్‌షిప్‌ పోస్టుపై స్పందించిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

Tej pratap yadav: నా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది.. రిలేషన్‌షిప్‌ పోస్టుపై స్పందించిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్జేడీ అధినేత, బిహార్‌ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap Yadav) మరోసారి వార్తల్లో నిలిచారు.


రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ ఆయన పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై తాజాగా ఆయన స్పందిస్తూ.. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్‌ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం


చేశారు. అసలేం జరిగిందంటే..  శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్‌ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్‌లో


ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీనిపైనే ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన సోషల్‌ మీడియాను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని


దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు. తేజ్‌ ప్రతాప్‌ 2018లో బిహార్‌ మాజీ


ముఖ్యమంత్రి దరోగా రాయ్‌ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.