Operation sindoor: 26 ప్రాంతాల్లో పాక్‌ డ్రోన్ల దాడి.. దీటుగా తిప్పికొట్టిన సైన్యం

Operation sindoor: 26 ప్రాంతాల్లో పాక్‌ డ్రోన్ల దాడి.. దీటుగా తిప్పికొట్టిన సైన్యం

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్: పాకిస్థాన్‌ (Pakistan) డ్రోన్ల దాడిని వరుసగా రెండో రోజు కూడా కొనసాగిస్తోంది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్‌ వరకు అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ (Line of


Control) వెంబడి 26 ప్రాంతాల్లో డ్రోన్ల దాడికి తెగబడింది. పౌరులు, ఆర్మీని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ సాయుధ డ్రోన్లను ప్రయోగిస్తోంది. బారాముల్లా, శ్రీనగర్‌, అవంతిపొర, జమ్మూ, సాంబా,


పఠాన్‌కోట్‌లతో పాటు అమృత్‌సర్‌, ఫిరోజ్‌పుర్‌, హోషియార్‌పుర్‌, గురుదాస్‌పుర్‌ తదితర ప్రాంతాల్లో దాయాది దేశం డ్రోన్‌ దాడికి తెగబడిందని సైన్యం తెలిపింది.  డ్రోన్‌ దాడుల్ని భారత సైన్యం దీటుగా


తిప్పికొడుతోంది. వీటిలో కొన్ని ఆయుధాలతో కూడిన డ్రోన్లు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఫిరోజ్‌పూర్‌లో డ్రోన్‌ దాడిలో ఓ కుటుంబం గాయపడింది. భద్రతా దళాలు అక్కడికి చేరుకుని గాయపడిన వారికి వైద్య సాయం


అందించారు. భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ కౌంటర్‌ డ్రోన్‌ సిస్టమ్స్‌ ద్వారా ఎప్పటి కప్పుడు డ్రోన్‌ దాడులను తిప్పికొడుతున్నాయి. భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని


సైన్యం సూచించింది. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేసింది.