
Operation sindoor: మమ్మల్ని సంప్రదించకుండానే అఖిలపక్షంలో యూసఫ్ పఠాన్ పేరు: తృణమూల్
Play all audios:

పాకిస్థాన్ తీరును ఎండగట్టేందుకు భారత్ తరఫున విదేశాలకు వెళ్తున్న దౌత్యబృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్ తప్పుకున్నారు. ఇంటర్నెట్‌డెస్క్: ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై
విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఏడు బృందాలు విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ యూసఫ్ పఠాన్ (Yusuf
Pathan) తప్పుకున్నారు. తమను సంప్రదించకుండానే పఠాన్ ఎంపిక జరిగిందంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్రంపై విమర్శలు చేశారు. పాక్‌ను ఎండగట్టే దౌత్యబృందంలో కేంద్రం అన్ని
పార్టీల సభ్యులకు చోటు కల్పించింది. అందులో టీఎంసీ పార్టీ నుంచి బహంపుర్‌కు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూసఫ్ పఠాన్‌ను ఎంపిక చేసింది. అయితే, ఈ ఎంపికను టీఎంసీ తప్పుబట్టింది. తమను
సంప్రదించకుండా పఠాన్‌ను దౌత్యబృందంలో చేర్చడం సమంజసం కాదని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరపాలని కేంద్రానికి సూచించారు. అంతేకాక..
కేంద్రం నిర్ణయించిన దౌత్య బృందం పర్యటనకు పఠాన్ వెళ్లడం లేదని స్పష్టంచేశారు. * శశిథరూర్‌పై వేటు వేద్దామా.. వద్దా ?భాజపా అస్త్రంతో ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్..! పహల్గాం ఘటన నేపథ్యంలో
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ దౌత్యయుద్ధం ప్రారంభించింది. ఇందులోభాగంగా మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో
పర్యటించనున్నారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేత గానీ, అధికారి గానీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 51
మందిలో 31 మంది ఎన్డీయే నేతలు, 20 మంది ఎన్డీయేతర పార్టీల నేతలున్నారు. ‘ఒకే లక్ష్యం.. ఒకే సందేశం.. ఒకే భారత్’ పేరుతో ఈ పర్యటనలు సాగనున్నాయి.