Pm modi: 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగుపెడతాడు: ప్రధాని మోదీ

Pm modi: 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగుపెడతాడు: ప్రధాని మోదీ

Play all audios:


దిల్లీ : అంతరిక్షంలో భారత్‌ ఎన్నో విజయాలు సాధిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ‘గ్లోబల్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ సదస్సు’ ప్రారంభం సందర్భంగా మోదీ తన వీడియో సందేశాన్ని ఇచ్చారు.


మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. చంద్రుడిపై నీటి జాడ ఉందని తొలిసారి చంద్రయాన్‌ ద్వారా గుర్తించామన్నారు. దక్షిణాసియా దేశాల కోసం ప్రత్యేక ఉపగ్రహం


ప్రయోగించినట్లు గుర్తు చేశారు. త్వరలో భారత వ్యోమగామి రోదసీలో పర్యటిస్తాడని మోదీ పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగుపెడతాడని వెల్లడించారు. దిల్లీలో గ్లోబల్‌ స్పేస్‌


ఎక్స్‌ప్లోరేషన్‌ కాన్ఫరెన్స్‌ (GLEX 2025) నేటినుంచి 9 వరకు జరగనుంది. మరోవైపు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పలు దేశాల పర్యటనలను రద్దు


చేసుకున్నారు.