
Cannes 2025: కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ.. ఫొటోలు వైరల్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: తారల సందడితో 78వ కేన్స్ చిత్రోత్సవాలు కోలాహలంగా (Cannes Film Festival) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 13న ప్రారంభమైన ఈ సినీ వేడుక 24 వరకు జరగనుంది. ఈ ఫిల్మ్
ఫెస్టివల్‌లో ఇప్పటికే కొందరు నటీనటులు అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. తాజాగా నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తొలిసారి కేన్స్‌లో మెరిశారు. తన లుక్‌తో శ్రీదేవిని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆమె
కేన్స్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. * కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్: మోదీ ఫొటో నెక్లెస్‌తో రుచి గుజ్జర్.. పొడవాటి గౌన్‌ను ధరించిన జాన్వీ రాచరికం ఉట్టిపడేలా రెడ్ కార్పెట్‌పై
హొయలొలికించారు. ఆమెతో పాటు ‘హోమ్ బౌండ్’ చిత్రబృందం కూడా కేన్స్‌కు హాజరైంది. రెడ్ కార్పెట్‌పై జాన్వీకి ఇషాన్ ఖట్టర్ సాయం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీ లుక్ చూసినవారంతా
శ్రీదేవి గుర్తుకు వస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్ బౌండ్’ (Home Bound) సినిమాని ఆ వేడుకలో
ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఇది టీమ్‌కు దక్కిన గౌరవం అని జాన్వీ అన్నారు. దీనికోసం చిత్రబృందమంతా అక్కడికి చేరుకుంది.