Kangana ranaut: దానికి నేనెన్నడూ భయపడలేదు: కంగనారనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Kangana ranaut: దానికి నేనెన్నడూ భయపడలేదు: కంగనారనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Play all audios:


Kangana Ranaut | ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా పరిశ్రమలో ఏజ్‌ టాపిక్ ఏదోరకంగా నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ విషయంలో ఇది పెద్ద ప్రభావమే చూపిస్తుంటుంది. ఇప్పుడు ఇదే అంశంపై కంగనా


రనౌత్ (Kangana Ranaut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రసీమ కంటే రాజకీయరంగమే వయసుమీద పడుతోన్న మహిళల పట్ల దయతో ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఆధ్యాత్మిక భావన నిండిన నా మనసు వయసు గురించి ఎప్పుడూ


భయపడలేదు. కానీ నా చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులు తెల్లజుట్టు చూడగానే.. భయపడిపోయి, కలర్‌ స్ప్రేలు ఉపయోగిస్తారు. ఈ వయసు ప్రభావం లేని ప్రదేశంలో ఉండటం సంతోషంగా ఉంది. వయసు పెరగడం కూడా ఓ ఆనందమే.


సినిమా పరిశ్రమలో కంటే రాజకీయాలు వృద్ధ మహిళ పట్ల దయతో ఉంటాయని అనుకుంటున్నారా..? నా సమాధానమైతే అవుననే’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్టు పెట్టారు. అలాగే పెద్దగా అలంకరణ లేకుండా దిగిన ఫొటోలను


షేర్ చేశారు. కాగా.. బాలీవుడ్ విషయంలో కంగన ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను సూటిగా చెప్తుంటారన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ చిత్రాలు వివాహ వ్యవస్థను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఇటీవల


ఆరోపించారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలను తప్పుగా చూపించడం మానాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోవాలని, గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేస్తే


చివరకు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంగన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజవర్గం నుంచి భాజపా తరఫున ఎంపీగా ఉన్నారు.


పార్లమెంట్‌, తన సొంత నియోజకవర్గం, సొంత రాష్ట్రంలో దిగిన దృశ్యాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. సినిమాల పరంగా చూస్తే.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’


(Emergency) చిత్రంలో చివరిగా కనిపించారు.