
Rakesh poojary: మిత్రమా.. మళ్లీ జన్మించు: ‘కాంతార 2’ నటుడి మృతిపై రిషబ్‌శెట్టి
Play all audios:

నటుడు రాకేశ్ పూజారి (34) (Rakesh Poojary) మృతి పట్ల ‘కాంతార 2’ (Kantara 2) హీరో రిషబ్‌శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధులు సంతాపం వ్యక్తంచేశారు. ఇంటర్నెట్ డెస్క్: నటుడు
రాకేశ్ పూజారి (34) (Rakesh Poojary) మృతి పట్ల ‘కాంతార 2’ (Kantara 2) హీరో రిషబ్‌శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘రాకేశ్ పూజారి మరణించారన్న వార్త కలచివేసింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఈ కష్టకాలం నుంచి ఆ కుటుంబం త్వరగా
కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. మిత్రమా.. మళ్లీ జన్మించు: రిషబ్‌శెట్టి ‘మిత్రమా.. మళ్లీ జన్మించు’ అంటూ నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty) ఎమోషనల్ పోస్టు
పెట్టారు. ‘‘కాంతార’లోని నీ పాత్ర, ఆ క్యారెక్టర్‌ను పెర్ఫామ్ చేసే క్రమంలో నీ ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటాయి. నీ లోటు మరొకరు తీర్చలేనిది’’ అని పేర్కొన్నారు. రాకేశ్
కుటుంబానికి సానుభూతి తెలిపారు. * ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా నాతో చెప్పండి..: నటుడి భార్య పోస్ట్‌పై స్పందించిన గాయని సోమవారం తెల్లవారుజామున రాకేశ్ గుండెపోటుతో మరణించినట్టు కన్నడ నటుడు
శివరాజ్ కేఆర్ తెలిపారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో పాల్గొన్న రాకేశ్.. డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలిపోయారు. టెవిలిజన్ షో ‘కామెడీ ఖిలాడిగలు’
సీజన్ 3 విజేతగా నిలిచి, మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్.. కన్నడ, తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించారు. ‘కాంతార 2’లోని పాత్ర చిత్రీకరణను ఇటీవల పూర్తి చేసినట్టు సమాచారం. హిట్ మూవీ
‘కాంతార’కు ప్రీక్వెల్ ‘కాంతార 2’. స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి పని చేసిన జూనియర్ ఆర్టిస్ట్ ఒకరు కొన్ని రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయిన సంగతి
తెలిసిందే. సినిమా సెట్స్‌లోనే ఆర్టిస్ట్ మరణించాడంటూ వార్తలు రాగా చిత్ర బృందం వాటిని ఖండించింది. అతడు చనిపోయిన రోజు.. సినిమా చిత్రీకరణ లేదని చెప్పింది.