Manchu vishnu: ‘కన్నప్ప’ విషయంలో చేసిన పెద్ద తప్పు అదే: మంచు విష్ణు

Manchu vishnu: ‘కన్నప్ప’ విషయంలో చేసిన పెద్ద తప్పు అదే: మంచు విష్ణు

Play all audios:


మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్‌డెస్క్‌: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన


పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వం వహించారు. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు విష్ణుతో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ


(Tammareddy Bharadwaj) ఇంటర్వ్యూ చేశారు. ఈ సినిమా వల్ల తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ వల్లే సినిమా ఆలస్యమైందని చెప్పారు. ‘‘2014లో తనికెళ్ల భరణి గారు


కన్నప్ప ఐడియా చెప్పారు. ఆయన చెప్పిన ఐడియా నాకెంతో నచ్చింది. విదేశాల నుంచి నిపుణులను పిలిపించి దీనిని డెవలప్‌ చేయించా. కొన్ని నెలలకే ఆయన నా అభిరుచిని గమనించి.. భారీ స్థాయిలో సినిమా


చేయమన్నారు. ఆ కథ తీసుకుని నా వెర్షన్‌లో దానిని సిద్ధం చేయించా. రూ.100 కోట్ల లోపే బడ్జెట్‌ అవుతుందనుకున్నా. కానీ, అనుకున్న దాని కంటే రెట్టింపు ఖర్చు అయింది. ‘మహాభారత్‌’ తీసిన దర్శకుడు


ముకేశ్‌కుమార్ సింగ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తే బాగుంటుందని నాన్నే చెప్పారు. శివుడి ఆజ్ఞ, నా తండ్రి ఇచ్చిన సపోర్ట్‌తోనే నేను ఇదంతా చేయగలిగా. టీమ్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరూ నాకెంతో అండగా


నిలిచారు. ఈ సినిమా విషయంలో నన్నెంతో సపోర్ట్‌ చేసి, ప్రోత్సహించిన వ్యక్తి ప్రభాస్‌. తనకి ఎప్పటికీ రుణపడి ఉంటా. ప్రభాస్‌ పోషించిన విభిన్న పాత్రల్లో రుద్ర పాత్ర మైలు రాయిగా నిలిచిపోతుంది.


నాన్నకు ప్రభాస్‌కు మధ్య ఓ సన్నివేశం ఉంటుంది. అది చాలా హైలైట్‌గా నిలుస్తుంది’’ అని మంచు విష్ణు చెప్పారు. తనకు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం ఇష్టమన్న విష్ణు.. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌లో సరైన


ప్రావీణ్యం లేని వ్యక్తిని తీసుకున్నానని అందుకే ఇది ఆలస్యమైందన్నారు. అదే తాను చేసిన పెద్ద తప్పు అని చెప్పారు. అనుకున్న సమయానికి రిలీజ్‌ చేసేందుకు టీమ్‌ ఎంతగానో శ్రమిస్తుందన్నారు. ఇదే


ఇంటర్వ్యూలో మోహన్‌బాబు కుటుంబంలో నెలకొన్న వివాదాల గురించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. వివాదాలు చూస్తుంటే తనకెంతో బాధగా అనిపిస్తుందని చెప్పారు. ‘కన్నప్ప’ విడుదలయ్యాక కుటుంబసభ్యులందరూ


ఒకచోట కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. కావాలంటే ఈ విషయంలో తాను పెద్దరికం తీసుకుంటానని చెప్పారు. దీనిపై స్పందించిన విష్ణు.. ‘‘మీ మాటలు నేను గౌరవిస్తాను. గొడవలు జరిగిన


కొన్నిరోజులకే మీరు నాకు ఫోన్‌ చేశారు. ఏం జరుగుతుంది అసలు అని అడిగారు. దానిని నేనెప్పటికీ మర్చిపోను. ఇండస్ట్రీ ఒక కుటుంబం. భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మీ సలహాలు తీసుకుంటా. మీ మాటలు నేను ఫాలో


అవుతా’’ అని చెప్పారు.