
Gaddar film awards: 2014- 2023 సినిమాలకు గద్దర్ అవార్డులు.. ఉత్తమ చిత్రాలివే
Play all audios:

2014-2023 సంవత్సరాల్లో విడుదలైన సినిమాలకు సంబంధించి గద్దర్ అవార్డుల వివరాలను మురళీమోహన్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులపై
(Gaddar film awards) ప్రముఖ సినీనటుడు, జ్యూరీ ఛైర్మన్ మురళీమోహన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు
విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు
చెప్పారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాకవి, దివంగత కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు. సంవత్సరాల వారీగా
ఉత్తమ చిత్రాలివే.. 2014 * ప్రథమ ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్ * రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల * మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను 2015 * ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి * రెండో ఉత్తమ చిత్రం: కంచె
* మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు 2016 * ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి * రెండో ఉత్తమ చిత్రం: పెళ్ళి చూపులు * మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్ 2017 * ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2 * రెండో
ఉత్తమ చిత్రం: ఫిదా * మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ 2018 * ప్రథమ ఉత్తమ చిత్రం: మహానటి * రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం * మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం 2019 * ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి * రెండో
ఉత్తమ చిత్రం: జెర్సీ * మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం 2020 * ప్రథమ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో.. * రెండో ఉత్తమ చిత్రం: కలర్ ఫొటో * మూడో ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలొడీస్ 2021 * ప్రథమ
ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్ * రెండో ఉత్తమ చిత్రం: అఖండ * మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన 2022 * ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం * రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2 * మూడో ఉత్తమ చిత్రం: మేజర్ 2023 *
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ * పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: మణిరత్నం * బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్ * నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి
పూర్ణచంద్రరావు * కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ * రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్