
Shaktimaan: సరికొత్తగా ‘శక్తిమాన్’.. నేటి యువత ఇష్టపడే ఫార్మాట్‌లో..
Play all audios:

ఇంటర్నెట్‌డెస్క్: 1990లలో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ షో శక్తిమాన్ (Shaktimaan). ముఖేశ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఇది భారత్‌లోనే మొదటి సూపర్ హీరో సిరీస్. ఇప్పుడు మరోసారి
నేటితరాన్ని అలరించడానికి సిద్ధమైంది. సరికొత్త ఫార్మాట్‌లో ముఖేశ్ ఖన్నా వచ్చేస్తున్నారు. ఆడియో సిరీస్‌లో ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. దీనికి ముఖేశ్ ఖన్నా వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. దీనిపై
ఆయన (Mukesh Khanna) ఆనందం వ్యక్తంచేశారు. ‘‘శక్తిమాన్ కేవలం ఓ షో మాత్రమే కాదు. ఇది కొన్ని మిలియన్ల మందికి ఎమోషన్. మరోసారి దీన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఆనందంగా, గర్వంగా ఉంది.
నేటితరానికి అనుగుణంగా పాకెట్ ఎఫ్ఎంలో ఆడియో సిరీస్ రూపంలో అందించనున్నాం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇయర్‌ఫోన్స్‌లో ఇప్పుడు శక్తిమాన్‌ను ఎంజాయ్ చేయండి. శక్తిమాన్ విలువలు, అతడి బలం,
సూపర్ పవర్‌లను తిరిగి పరిచయం చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్ గొప్ప మార్గాన్ని కనుగొంది. నేటి యువత ఇష్టపడే ఫార్మాట్లో కొత్త కథలతో మీ ముందుకు వస్తుంది’’ అని చెప్పారు. * కేన్స్‌లో తొలిసారి మెరిసిన
జాన్వీ.. ఫొటోలు వైరల్ 1997 నుంచి 2005 వరకూ శక్తిమాన్ దూరదర్శన్‌లో ప్రసారమైంది. ఇప్పుడు దీన్నే ఆడియో రూపంలో అందించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.