Special ops 2: యాక్షన్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ‘స్పెషల్‌ ఓపీఎస్‌2 ’ వచ్చేస్తోంది

Special ops 2: యాక్షన్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ‘స్పెషల్‌ ఓపీఎస్‌2 ’ వచ్చేస్తోంది

Play all audios:


Special Ops season 2 || (ఇంటర్నెట్‌డెస్క్‌): ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన వెబ్‌సిరీస్‌ల్లో ‘స్పెషల్‌ ఓపీఎస్‌’ (Special Ops) ఒకటి. కేకే మేనన్‌, కరణ్‌ థాకర్‌, వినయ్‌ పాఠక్‌, విపుల్‌


గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు నీరజ్‌ పాండే, శివమ్‌ నాయర్‌ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్‌ జానర్‌లో 8 ఎపిసోడ్‌లతో వచ్చిన ఫస్ట్‌ సీజన్‌ ఎంతగానో థ్రిల్‌ పంచింది. దానిలో


అంతర్భాగంగా ‘స్పెషల్‌ ఓపీఎస్‌ 1.5: ది హిమ్మత్‌ స్టోరీ’ తీసుకొచ్చిన 4 ఎపిసోడ్స్‌లు కూడా ఆకట్టుకున్నాయి. మొదటి సీజన్‌కు మించి థ్రిల్‌ పంచేందుకు ‘స్పెషల్ ఓపీఎస్‌2’ (Special Ops2) సిద్ధమైంది. ఈ


విషయాన్ని తెలియజేస్తూ జియో హాట్‌స్టార్‌ గ్లింప్స్‌ను పంచుకుంది. ఇప్పటికే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లతో పాటు, కొత్తగా నటీనటులు కూడా యాడ్‌ అయ్యారు. తాహిర్‌ రాజ్‌ బాసిన్‌, సయామీఖేర్‌, ముజామిల్‌


ఇబ్రహీం, టోటా రాయ్‌ చౌదరి తదితరులతో పాటు, విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఇందులో ఆయన పాత్ర ఏంటి? దాని నేపథ్యం ఏంటి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


‘స్పెషల్‌ ఓపీఎస్‌2’కు కూడా నీరజ్‌ పాండే దర్శకత్వం వహించడంతో పాటు, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘‘ఈసారి కథలో గాఢత, భావోద్వేగాలు మరింత థ్రిల్‌ పంచుతాయి. మొదటి సీజన్‌ను మించి మరింత కొత్తగా,


నాణ్యంగా అందించడానికి  నిర్మాణ సంస్థ ఫ్రైడే స్టోరీ టెల్లర్స్‌, జియో హాట్‌స్టార్‌ ఎంతో కృషి చేస్తున్నాయి. వీలైనంత త్వరగా ప్రేక్షకులకు సరికొత్త చాప్టర్‌ను అందించడానికి మేమెంతో ఉత్సాహంగా


ఉన్నాం’’ అని నీరజ్‌ పాండే అన్నారు. హిమ్మత్‌ సింగ్‌ పాత్ర చేయడం తనకొక సవాల్‌ అని నటుడు కేకే మేనన్‌ ఈ సందర్భంగా. సీజన్‌2లో అది మరింత ఆసక్తికరంగా ఉంటుందన్నారు. తొలి ఒకటిన్నర భాగాలకు మించి


పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌తో సీజన్‌2 రూపొందిందని, అది ప్రేక్షకుడికి మరింత థ్రిల్లింగ్‌ అనుభూతిని అందిస్తుందని తెలిపారు. మన రా (RAW), ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల ఆటకట్టించడానికి ఎలాంటి


సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహిస్తాయన్నది ‘స్పెషల్‌ ఓపీఎస్‌’లో చూపించారు. 2001లో పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడి కోసం సాగించే వేటను తొలి సీజన్‌లో చూడొచ్చు. ‘రా’ ఉన్నతాధికారి అయిన


హిమ్మత్‌ సింగ్‌ (కేకే మేనన్‌) తొలిరోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లను ‘స్పెషల్‌ ఓపీఎస్‌ 1.5’లో చూపించారు. ఇప్పుడు సరికొత్త అధ్యాయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.