
డబ్లిన్‌లో వైభవంగా శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సం
Play all audios:

శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని స్థానిక VHCCI ఆలయంలో నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవ, పల్లకి
సేవలు నిర్వహించారు. శివకుమార్-మాధవి, విద్యనాథ్- రజిత, కళ్యాణ్-ఇనిస్ శీతల్ కుమార్-వర్షిణి దంపతులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా గోపూజలు చేశారు.
చిన్నపిల్లలకు కుమారి పూజ చేయగా, శ్రీనివాస్- సరిత, సంతోష్-విన్య దంపతులు కన్యలందరికీ బహుమతులు, తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు. మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన చేశారు. ఈ
పూజా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్-మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. శిరీష, కవిత, రేణుక తదితరులు అమ్మవారి విశేష పారాయణం చేశారు.
స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE తదితరులు సహకారం అందించారు. లక్ష్మి హాసిని, మౌనిక వ్యాఖ్యానకర్తలుగా
సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారి ప్రసాద వితరణ కార్యక్రమానికి కిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులు తమవంతు సహాయ సహకారాలను
అందించారు. చివరిగా అపూర్వ ఛారిటీ సంస్థ తరపున ప్రవీణ్.. నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి వివరించారు. అనంతరం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు అందించాల్సిన సాయం గురించి
తెలియజేశారు. కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురిలు పాల్గొని
విజయవంతంగా ముగించారు.