Elon musk: మళ్లీ తండ్రి అయిన మస్క్‌.. బిడ్డ పేరేంటంటే?

Elon musk: మళ్లీ తండ్రి అయిన మస్క్‌.. బిడ్డ పేరేంటంటే?

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కుబేరుడు, డోజ్‌ సారథి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మరోసారి తండ్రి అయ్యారు. ఆయన సహజీవన భాగస్వామి న్యూరోలింక్‌ ఎగ్జిక్యూటివ్‌ షివోన్ జిలిస్‌ (Shivon Zilis) స్వయంగా ఈ


విషయాన్ని వెల్లడించారు. తమ బిడ్డకు సెల్డాన్‌ లైకుర్గస్‌ అని పేరు పెట్టినట్లు తెలిపారు.  ‘ఎలాన్‌తో మాట్లాడాను. మా కుమారుడు సెల్డాన్‌ లైకుర్గస్‌ గురించి ప్రపంచానికి స్వయంగా తెలియజేయాలని


నిర్ణయించుకున్నాం’ అని షివోస్‌ రాసుకొచ్చారు. తమ మూడో బిడ్డ ఆర్కాడియా పుట్టినరోజు సందర్భంగా ఈవిషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఈ పోస్టుకు హార్ట్‌ సింబల్‌తో మస్క్‌ రిప్లై


ఇచ్చారు.  ఇప్పటివరకు మస్క్‌కు 12 మంది సంతానం. మొదటి భార్య జస్టిన్‌కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు


జన్మనిచ్చింది. 2008లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటన్‌ నటి తాలులాహ్‌ రిలేను మస్క్‌ వివాహమాడారు. అయితే వారికి సంతానం లేదు. అనంతరం కెనడియన్ గాయని గ్రిమ్స్‌తో సంబంధం నెరిపారు. వారికి


ముగ్గురు పిల్లలు. అనంతరం తన ప్రతిష్ఠాత్మక సంస్థ బ్రెయిన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న జిలిస్‌తో సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు


ఉండగా.. తాజాగా ఈ జంట నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. * సంతానోత్పత్తి రేటు తగ్గుదలతో సింగపూర్‌కు మళ్లీ అసంతృప్తి ఇదిలాఉండగా.. ఇటీవల తన బిడ్డకు తండ్రి మస్క్‌ అంటూ రచయిత్రి ఆష్టీ సెయింట్‌


క్లెయిర్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితమే తానో బిడ్డకు జన్మనిచ్చానని అయితే గోప్యత, భద్రతా కారణాల వల్ల ఈ విషయం బహిర్గతం చేయలేదని ఆమె తెలిపారు. దీనిపై ఇప్పటివరకు మస్క్‌ ఎలాంటి


స్పష్టమైన ప్రకటనా చేయలేదు. ఒకవేళ ఈ బిడ్డకు కూడా మస్క్‌ తండ్రి అని తేలితే.. ఇప్పటివరకు ఆయనకు 14 మంది సంతానం ఉన్నట్లు అవుతుంది.