Donald trump: బైడెన్‌కు క్యాన్సర్‌ సోకితే ఎందుకు రహస్యంగా ఉంచారు? : ట్రంప్‌

Donald trump: బైడెన్‌కు క్యాన్సర్‌ సోకితే ఎందుకు రహస్యంగా ఉంచారు? : ట్రంప్‌

Play all audios:


అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్‌ నిర్ధరణ ఆలస్యం కావడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశ్నించారు. ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe


Biden)కు క్యాన్సర్‌ నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌కు క్యాన్సర్‌ సోకిందనే విషయాన్ని


ఆలస్యంగా బయటపెట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  బైడెన్‌కు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధరణ అయినట్లు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. ఈ


క్యాన్సర్‌ను గ్లీసన్‌ స్కోరింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించి అంచనా వేస్తారు. ఇందులో బైడెన్‌ స్కోరు 9 ఉన్నట్లు కార్యాలయం తెలిపింది. దీనిపైనే తాజాగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘క్యాన్సర్‌ సోకిందన్న విషయం


చాలా రోజుల తర్వాత తెలియడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కోరు 9కు చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. బైడెన్‌ మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నారని గతంలో అదే వైద్యుడు చెప్పారు. ఇది రాజకీయమైన అంశం


కాదు. ఇది మన దేశానికి ప్రమాదం. క్యాన్సర్‌ విషయం ఇప్పటివరకు ఎందుకు బయటకు చెప్పలేదు. ప్రజలకు దీని గురించి వాస్తవాలు తెలియాలి. కొందరు వాస్తవాలు చెప్పడం లేదు. ఇది మరో పెద్ద సమస్య’ అని ట్రంప్‌


పేర్కొన్నారు. * Joe Biden: బైడెన్‌కు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ జిల్‌ బైడెన్‌ నకిలీ వైద్యురాలు జో బైడెన్‌ క్యాన్సర్‌ నిర్ధరణ ఆలస్యం కావడంపై డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ స్పందించారు. ఈసందర్భంగా


బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ (Jill Biden) ఒక నకిలీ వైద్యురాలంటూ విమర్శలు చేశారు. జిల్‌ డాక్టర్‌ అయినప్పటికీ తన భర్తలో క్యాన్సర్‌ లక్షణాలు గమనించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన


ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.