Tsrtc: హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ రూట్లో బస్సు సర్వీసు.. వివరాలివే!

Tsrtc: హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ రూట్లో బస్సు సర్వీసు.. వివరాలివే!

Play all audios:


Published by: Last Updated:August 06, 2023 11:28 AM IST తాజాగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల (IT EMPLOYEES) సౌకర్యార్థం మరో కొత్త రూట్ లో బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. ఇందుకు


సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించడమే సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (TSRTC) అనేక కొత్త రూట్లలో బస్సులను నడుపుతోంది. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలు


అందించానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. లాంగ్ రూట్లలో సర్వీసులు నడపడం ద్వారా ప్రయాణికులు బస్సులు మారాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడుతోంది. తాజాగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల (IT Employees)


సౌకర్యార్థం మరో కొత్త రూట్ లో బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. నగర శివరులోని గాజులరామారం నుంచి వేవ్ రాక్ కు (Waverock) ప్రత్యేక బస్సును TSRTC తాజాగా ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక


బస్సు ఉదయం 08:40 గంటలకు గాజులరామారం నుంచి బయలుదేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సు మహాదేవ్ పురం, ఎన్టీఆర్ గార్డెన్, ఎల్లమ్మ బండ, KPHB, JNTU, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, బయో


డైవర్శిటీ, గచ్చిబౌలి క్రాస్ రోడ్, విప్రో జంక్షన్ మీదుగా వేవ్ రాక్ కి చేరుకుంటుంది. ఈ బస్సు సాయంత్రం 6:10 గంటలకు అక్కడి నుంచి తిరుగి బయలు దేరుతుంది. > హైదరాబాద్ లోని ఐటీ > ఉద్యోగుల 


సౌకర్యార్థం > గాజులరామారం నుంచి వేవ్ > రాక్ కు ప్రత్యేక బస్సును > #TSRTC ఏర్పాటు చేసింది. ఈ > ప్రత్యేక బస్సు ఉదయం 08:40 > గంటలకు గాజులరామారం నుంచి > బయలుదేరుతుంది. మహాదేవ్


> పురం, ఎన్టీఆర్ గార్డెన్, > ఎల్లమ్మ బండ, KPHB, JNTU, హైటెక్ > సిటీ, మైండ్ స్పేస్, బయో > డైవర్శిటీ,… pic.twitter.com/gnze0CqDyg > — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) 


August 2, 2023 advertisement ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకుని.. సంస్థను ఆదరించాలని ఆయన కోరారు.


Location : Hyderabad,Hyderabad,Telangana First Published : August 06, 2023 11:17 AM IST Read More