
Jee advanced 2025: ‘జేఈఈ అడ్వాన్స్డ్’ విద్యార్థుల రెస్సాన్స్ షీట్లు విడుదల
Play all audios:

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్. By Features Desk Updated : 22 May 2025 19:47 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read ఇంటర్నెట్
డెస్క్: జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced 2025) పరీక్ష రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్. దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025
పరీక్ష రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18న పరీక్ష నిర్వహించిన ఐఐటీ కాన్పూర్ అధికారులు.. తాజాగా విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు జేఈఈ
అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్లు పొందొచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి మే 18న రెండు షిఫ్టుల్లో
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశ వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్టులో ఈ
పరీక్షలు జరిగాయి. ప్రాథమిక కీని మే 26న విడుదల చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 2న తుది కీ, ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. Published : 22 May 2025 19:43 IST గమనిక: _ఈనాడు.నెట్లో
కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు
లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._