
Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/2025)
Play all audios:

మేషం శుభఫలితాలు ఉన్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది నెరవేరుతుంది. ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే వస్తుంది. ప్రశాంతత నెలకొంటుంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం. అశ్విని నక్షత్ర జాతకులకు
ప్రత్యారి తార - అంత మంచిది కాదు. భరణి నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది. కృత్తిక నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. వృషభం మీదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు,వినోద
కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. గురుధ్యానం శుభప్రదం. కృత్తిక నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. రోహిణి
నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది. మృగశిర నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. మిథునం ప్రారంభించిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. శ్రమ అధికం అవుతుంది. కీలక విషయాల్లో
సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శివ నామాన్ని జపించాలి. మృగశిర నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు; ఆర్ద్ర నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది.
పునర్వసు నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది. కర్కాటకం ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా
పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాధ్యానం చేస్తే మంచిది. పునర్వసు నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది. పుష్యమీ నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది. ఆశ్లేష నక్షత్ర
జాతకులకు సాధక తార - చాలా మంచిది. సింహం సమయానుకూలంగా ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. అకారణ కలహ సూచన. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బంది పడతారు. కుటుంబంలో
చిన్నపాటి సమస్యలు వస్తాయి. దుర్గాధ్యానం శుభప్రదం. మఖ నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. పుబ్బ నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు విపత్తార -
చెడ్డది. కన్య తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అధిగమించే
ప్రయత్నం చేస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానించాలి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. హస్త నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది. చిత్త నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది
కాదు. తుల అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. దుర్గాదేవి నామాన్ని జపించడం ఉత్తమం. చిత్త
నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. స్వాతీ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది. విశాఖ నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది. వృశ్చికం శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను
రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. విశాఖ నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది. అనురాధ
నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది. ధనుస్సు ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో
ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం. మూల నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. మకరం వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా
మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. శ్రీలక్ష్మీ ధ్యానంతో మనోబలం పెరగడంతో పాటు శుభప్రదం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. శ్రవణం నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది. ధనిష్ఠ
నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. కుంభం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని
పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. శతభిషం నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది.
మీనం మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శని జపం
చేసుకోవాలి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది. రేవతీ నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది. _- ఇంటర్నెట్ డెస్క్_