
Ap news: మద్యం కుంభకోణం.. సిట్ ఎదుట హాజరైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి
Play all audios:

మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ
కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ
నేపథ్యంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో.. నాటి సీఎంవో కార్యదర్శి
ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప
మంగళవారం అరెస్టయిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా ఆయన్ను విజయవాడ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు.