
Ap dsc hall tickets: ఏపీలో వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
Play all audios:

ఏపీలో మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వాట్సప్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. AP DSC Hall Tickets| అమరావతి: ఏపీలో మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
విడుదలయ్యాయి. ఇప్పటికే CSE.AP.GOV.INలో అందుబాటులో ఉండగా.. వాట్సప్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 95523 00009కు మెసేజ్ చేసి హాల్టికెట్లు పొందవచ్చని విద్యాశాఖ
అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మెగా డీఎస్సీ నిర్వహణ పట్ల మా నిబద్ధత నెరవేరింది. డీఎస్సీలో అభ్యర్థులు ఉత్తమ
ప్రతిభ కనబరచాలి’’ అని లోకేశ్ అన్నారు. జూన్ 6 నుంచి 30 వరకు మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 20
నుంచి మే 15వరకు దరఖాస్తులు ఆహ్వానించగా.. అన్ని పోస్టులకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.