Kawasaki ninja zx 4r: నింజా జెడ్‌ఎక్స్‌-4ఆర్‌పై ఆఫర్‌.. ₹40వేలు డిస్కౌంట్‌

Kawasaki ninja zx 4r: నింజా జెడ్‌ఎక్స్‌-4ఆర్‌పై ఆఫర్‌.. ₹40వేలు డిస్కౌంట్‌

Play all audios:


Kawasaki Ninja ZX 4R | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) నింజా బైక్‌పై ఆఫర్‌ ప్రకటించింది. భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన నింజా జెడ్ఎక్స్‌-4ఆర్‌ (Ninja ZX


4R)పై రూ.40 వేల రాయితీని అందిస్తోంది. మే నెల వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌ ధర రూ.8.79 లక్షలు (ఎక్స్‌- షోరూమ్) కాగా.. ఆఫర్‌లో భాగంగా రూ.8.39 లక్షలకు కొనుగోలు చేయొచ్చు.  *


యాపిల్‌ మాత్రమే కాదు.. శాంసంగ్‌ పైనా ట్రంప్‌ టారిఫ్‌ బాంబ్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. 399సీసీ, లిక్విడ్‌- కూల్డ్, ఇన్‌లైన్‌ ఫోర్‌ ఇంజిన్‌తో వచ్చింది. 77 hp వద్ద 39 Nm టార్క్‌ను


ఉత్పత్తి చేశారు. 6-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ఇచ్చారు. 4.3 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇచ్చారు. స్పోర్ట్, రోడ్, రైన్, రైడర్ నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లను ఎంచుకొనే సదుపాయం ఉంటుంది. డ్యూయల్‌ ఛానల్‌


ఏబీఎస్‌ సపోర్ట్‌తో తీసుకొచ్చారు. ముందువైపు ఎల్‌ఈడీ సెటప్, బ్ల్యూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు. హోండా CBR650R, ట్రయంఫ్‌ డేటోనా 660, సుజుకీ GSX-8Rలకు పోటీగా నింజా బైక్‌ను కవాసకి భారత మార్కెట్లోకి


తీసుకొచ్చింది.