
Swiggy- zomato: వర్షం పడితే స్విగ్గీ, జొమాటో ఛార్జీ ‘తడిసి మోపెడు’..
Play all audios:

Swiggy- Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ, జొమాటో రెయిన్ సర్‌ఛార్జి మినహాయింపును తొలగించాయి. Swiggy- Zomato | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన స్విగ్గీ,
జొమాటో (Swiggy- Zomato) రెయిన్ సర్‌ఛార్జ్ మినహాయింపును తొలగించాయి. ఇకపై స్విగ్గీ వన్, జొమాటో గోల్డ్ చందాదారులు కూడా ఈ అదనపు రుసుము భరించాల్సి ఉంటుందన్నమాట. అంటే వర్షం పడితే సాధారణ
సబ్‌స్క్రైబర్లు, ప్రీమియం సబ్‌స్క్రైబర్లు అనే దాంతో సంబంధం లేకుండా అదనపు రుసుములు చెల్లించాల్సిందే. స్విగ్గీ తన కస్టమర్లకు మెరుగైన సేవలు, సౌలభ్యం కోరుకొనే వినియోగదారుల కోసం ‘స్విగ్గీ వన్’
పేరిట, జొమాటో ‘జొమాటో గోల్డ్ ’ పేరిట సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తోంది. వీటిని కొనుగోలు చేసిన వారికి ఇరు సంస్థలు పలు ప్రత్యేక ప్రయోజనాల్ని అందిస్తున్నాయి. వాటిలో రెయిన్ సర్‌ఛార్జ్
కూడా ఒకటి. అయితే తాజాగా ఈ సదుపాయాన్ని చందాదారులకు తొలగించినట్లు తెలుస్తోంది. అంటే ఇకపై సాధారణ యూజర్ల మాదిరిగానే వీళ్లు కూడా ఈ రుసుము కట్టాల్సిందే. భారీగా వర్షం పడే సమయంలో ఈ సర్‌ఛార్జ్ రూ.15
నుంచి రూ.30 వరకు ఉంటుంది. * ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు డౌన్.. కారణం ఇదే! ఇప్పటికే ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు క్విక్ కామర్స్ విభాగంలో పెద్ద ఎత్తున నష్టాల్ని
మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నష్టాలను తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డెలివరీ ఫీజుకు అదనంగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు
చేస్తున్నాయి. తాజా నిర్ణయం కారణంగా స్విగ్గీ, జొమాటో షేర్లు రాణిస్తున్నాయి.