Donald trump: తలుపులు వేసుకోవడం మర్చిపోవద్దు.. మెక్రాన్‌ దంపతుల గొడవపై ట్రంప్‌

Donald trump: తలుపులు వేసుకోవడం మర్చిపోవద్దు.. మెక్రాన్‌ దంపతుల గొడవపై ట్రంప్‌

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా ఉన్న ఓ వీడియో ఇటీవల వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.


తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) స్పందించారు. అలాంటివి జరిగేటప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో చూసుకోవాలన్నారు.  ఓవల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇటీవల


వైరల్‌ అయిన వీడియోపై స్పందించాలని ఓ విలేకరి ట్రంప్‌ను కోరారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. దీనిగురించి తాను నేరుగా మెక్రాన్‌తోనే మాట్లాడానని, అంతా బాగానే ఉందని తెలిపారు. ఈసందర్భంగా ‘అలాంటి


ఘటనలు జరిగినప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో ఒకసారి గమనించుకోవాలి’ అని ట్రంప్ చమత్కరించారు.  * ఎలాన్‌ మస్క్‌కు వీడ్కోలు పలికిన ట్రంప్‌ మెక్రాన్‌- బ్రిగెట్టాల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని


ఇటీవల ఫ్రెంచ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. వియత్నాం పర్యటనకు వెళ్లిన ఈ దంపతుల మధ్య హనోయ్‌ విమానాశ్రయంలో జరిగిన ఘటనే అందుకు కారణం. విమానం హనోయ్‌లో దిగిన తరవాత.. ఒక అధికారి తలుపును తెరిచినప్పుడు


మెక్రాన్‌ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్‌ ధరించిన రెండు చేతులు మెక్రాన్‌ను నెట్టివేశాయి. ఆయన వెంటనే తలతిప్పి వెనక్కి జరిగారు. ఈ దృశ్యం రికార్డు అవుతున్నట్లు


గమనించి చిరునవ్వుతో చేయి ఊపారు. ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్‌ వేసుకొని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. భార్య చేతిని పట్టుకోవడానికి మెక్రాన్‌ ప్రయత్నించినా ఆమె


ఇష్టపడలేదు. తరువాత ఇద్దరూ కలసి మెట్లు దిగి ఎర్రతివాచీ మీద పక్కపక్కనే నడిచారు. ఈ వీడియో దృశ్యాలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత మెక్రాన్‌ దీనిపై స్పందించారు. ఆ సందర్భాన్ని


ప్రతిఒక్కరూ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. తమ మధ్య ఎలాంటి గొడవ లేదని, అది తమ మధ్య జరిగిన సరదా సన్నివేశమని అన్నారు. దీనిచుట్టూ స్టోరీలు అల్లడంపై మండిపడ్డారు. ‘‘ఆ వీడియోల్లో నేను ఒక


టిష్యూ తీసుకున్నాను. ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా భార్యతో జోక్‌ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే’’ అని వివరణ ఇచ్చారు.