Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ (Coolie Movie). నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌


షాహిర్‌, సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ క్రమంలో దర్శకుడు లోకేశ్‌


కనగరాజ్‌ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్‌కు తొలుత వేరే కథ చెప్పానని, అది ఆయనకు నచ్చినా అనుకోని కారణాలతో ఈ కథను పక్కన పెట్టినట్లు తెలిపారు. ‘‘రజనీకాంత్‌ సర్‌తో సినిమా


చేయాలనుకున్నప్పుడు ఆయన్ను కలిసి ఒక కథ చెప్పాను. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. దాదాపు రెండు నెలలకు పైగా ఆ స్క్రిప్ట్‌పై వర్క్‌ చేశాం. ఆ కథ, దాని నేపథ్యం రజనీ సర్‌కు బాగా నచ్చాయి. రెండు నెలల


తర్వాత మళ్లీ ఆయన్ను కలిసినప్పుడు ‘ఈ కథ వద్దు. మరొక స్టోరీ చేద్దాం’ అని అన్నాను. అదే ‘కూలీ’. రజనీ సర్‌కు ఆ స్టోరీ నచ్చినా నేను చేయకపోవడానికి ఒక కారణం ఉంది. నేను అనుకున్న పాయింట్‌ ఒక చోట


పూర్తిగా డౌన్‌ అయిపోయినట్లు అనిపించింది. దీంతో ఆ ప్రాజెక్ట్‌పై ఆసక్తి సన్నగిల్లిపోయింది. భవిష్యత్‌లో ఎప్పుడైనా కొత్త ఆలోచన వస్తే, ఆ కథను అందుకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తా. అంతేకానీ, అదే


కథను పట్టుకుని రజనీ సర్‌ విలువైన సమయాన్ని వృథా చేయటం నాకు ఇష్టం లేదు’’ అని లోకేశ్‌ కనగరాజ్‌ చెప్పుకొచ్చారు. ఇక ‘కూలీ’ విషయానికొస్తే భారీ బడ్జెట్‌, భారీ తారాగణంతో లోకేశ్‌ దీన్ని


తీర్చిదిద్దారు. ఐటమ్‌ సాంగ్‌లో పూజా హెగ్డే ఆడి పాడింది. ఆమిర్‌ఖాన్‌ కూడా అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారు. ఆగస్టు 14న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘కూలీ’ని విడుదల


చేయనున్నారు. ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లోనూ ఈ మూవీ తీసుకొస్తున్నారు. రజనీకాంత్‌ ఇందులో కూలీ నెంబర్‌ 1421గా దేవా పాత్రలో సందడి చేయనున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సన్‌


పిక్చర్స్‌ నిర్మిస్తోంది.