
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరోసారి పండుగ ఆఫర్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలో బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) సేల్‌ను
నిర్వహించనుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో సేల్ ప్రకటనను ఉంచింది. అయితే, ఈ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. వచ్చే నెలలో దసరా పండుగ ఉన్న
నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను నిర్వహించాలని చూస్తోంది. అక్టోబరు మొదటి వారంలో ఈ సేల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సేల్‌లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ పేరుతో
ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించనుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లపై భారీగా ఆఫర్లు ఉండనున్నాయని వెబ్‌సైట్‌లోని ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, యాక్ససెరీస్‌లపై 50 నుంచి 80
శాతం, టీవీ, హోమ్ అప్లయెన్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెబ్‌సైట్ పేర్కొంది. ఇక హోమ్ డెకార్, బ్యూటీ, స్పోర్ట్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లు
ఉంటాయని తెలిపింది. వాహన ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి! బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా వివో, శాంసంగ్, మోటోరోలా కంపెనీలకు చెందిన ఆరు కొత్త ఫోన్లు విడుదల
కానున్నాయి. ఇవేకాకుండా ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13, గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 సిరీస్‌పై
ఫ్లిప్‌కార్ట్ ఎంత మేర డిస్కౌంట్ ఇస్తుందనే దానిపై యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.