Aarti ravi: మూడో వ్యక్తి వల్లే మేం విడిపోయాం.. ఆధారాలున్నాయి: జయం రవి సతీమణి ఆర్తి

Aarti ravi: మూడో వ్యక్తి వల్లే మేం విడిపోయాం.. ఆధారాలున్నాయి: జయం రవి సతీమణి ఆర్తి

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ నటుడు జయం రవి (Jayam Ravi), ఆయన సతీమణి ఆర్తి (Aarti Ravi) కొన్ని రోజులుగా ఒకరిపై మరొకరు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్తి తాజాగా


మరో పోస్టు పెట్టారు. తాము విడిపోవడానికి కారణం మనీ, పవర్‌లాంటివి కాదని, మూడో వ్యక్తే కారణమన్నారు. తాను ఈ విషయాన్ని ఊహించి చెప్పడం లేదని, తన వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. గాయని కెనీషాతో జయం


రవి రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కోలీవుడ్‌లో రూమర్స్‌ వచ్చాయి. వారిద్దరూ కలిసి ఇటీవల ఓ పెళ్లి వేడుకకు హాజరకావడం ఆ వార్తలకు బలాన్నిచ్చింది. సంబంధిత ఫొటోలు బయటకు రాగా.. ఆర్తి తొలిసారి స్పందిస్తూ


ఎమోషనల్ పోస్టు పెట్టారు. భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది జయం రవి ప్రకటించారు. అయితే, తనను సంప్రదించకుండానే ఆయన విడాకుల విషయం ప్రకటించారని ఆర్తి ఆరోపించారు. ఈ క్రమంంలోనే


వీరిద్దరూ గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణ దశలో ఉంది. ‘‘నా భర్తను జాగ్రత్తగా చూసుకోవడం, చెడు అలవాట్ల నుంచి కాపాడుకోవడం సాధ్యమవుతుందా? భర్త ఆరోగ్యం కోసం


ఏ భార్య అయినా ఇలాగే చేస్తుంది’’ అని ఆర్తి తాజా పోస్టులో పేర్కొన్నారు. తనను తన తల్లీదండ్రులతో కలవకుండా చేసిందని, తాను సంపాదించిన డబ్బును ఖర్చు చేయకుండా నియంత్రించిందంటూ జయం రవి చేసిన


వ్యాఖ్యలకు ఆర్తి ఇలా సమాధానమిచ్చారు. ‘‘ఇతరుల సానుభూతి పొందడం కోసం నా పిల్లలను ఓ సాధనంగా వాడుకోవడం చూస్తుంటే బాధగా ఉంది’’ అని జయం రవి కామెంట్స్‌పై ఆర్తి స్పందిస్తూ.. ‘‘ఏ తల్లీ అలా చేయదు’’ అని


అన్నారు. ‘‘అతడి కెరీర్‌ కోసం 15 ఏళ్లుగా నా కలలు, నా మాస్టర్స్ డిగ్రీ త్యాగం చేశా. జీవితాంతం నాతోనే ఉంటానని ప్రమాణం చేశాడు. కానీ, ఇప్పుడు ఆ మాట తప్పాడు. ఒకవేళ అతడిని నేను పట్టించుకోకపోయి


ఉంటే ఉన్నతంగా జీవించే దాన్ని. ఆర్థిక నిర్ణయాలన్నీ మేం కలిసే తీసుకున్నాం. సంబంధిత రికార్డులు నా వద్ద ఉన్నాయి. వాటిని కోర్టులో సమర్పిస్తా. నాపై ప్రేమ చూపిస్తున్న మీడియా, సోషల్‌ మీడియా, ప్రజలకు


కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిజం తెలిసిన ఏకైక వ్యక్తి నా భర్త. నేను బలహీనవంతురాలిని కాదు. ఇకపై ఏం చెప్పను. ఎందుకంటే న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది’’ అని ఆర్తి తన సుదీర్ఘ పోస్టులో


పేర్కొన్నారు.