Taylor swift: పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్ సౌధం సమీపంలో మనిషి అవశేషాలు.. సీరియల్‌ కిల్లర్‌ ప్రమేయం

Taylor swift: పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్ సౌధం సమీపంలో మనిషి అవశేషాలు.. సీరియల్‌ కిల్లర్‌ ప్రమేయం

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని (US) న్యూ ఇంగ్లాండ్‌ రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో ఓ సీరియల్‌ కిల్లర్‌ దారుణ హత్యలకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించారు. తాజాగా రోడ్


ఐలాండ్‌లోని మసాచుసెట్స్‌లలో ఉన్న పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) భవనం సమీపంలో మనిషి అవశేషాలు (Human remains) బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇదేవిధంగా న్యూ ఇంగ్లాండ్‌


కనెక్టికట్, రోడ్‌ ఐలాండ్‌, మసాచుసెట్స్‌ ప్రాంతాల్లో మనుషుల అవశేషాలు లభ్యమవడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరైనా సీరియల్‌ కిల్లర్‌ (serial killer) ఈ హత్యలకు పాల్పడుతుండొచ్చని


అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఎవెరెట్ అవెన్యూ ప్రాంతంలోని బీచ్‌లో మనిషి అవశేషాలు కొట్టుకువస్తున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు


పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల ఇదేవిధంగా మసాచుసెట్స్‌లో ఐదు మృతదేహాలు, కనెక్టికట్‌లో ఐదు మృతదేహాలు, రోడ్ ఐలాండ్‌లో మూడు మృతదేహాలు, టౌంటన్ అనే చిన్న పట్టణంలో రెండు మృతదేహాలు కనుగొన్నట్లు


పేర్కొన్నారు. తాజాగా స్విఫ్ట్‌ నివాసంతో సహా 12 ప్రాంతాల్లో మనుషుల కాళ్ల ఎముకలు వంటి అవశేషాలను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో చాలావరకు మహిళలకు సంబంధించినవిగా గుర్తించినట్లు


పేర్కొన్నారు. ఈ హత్యల వెనక ఎవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.   వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రభుత్వ


సంస్థలు ఈ విషయంపై స్పందిస్తూ..తాము తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై టేలర్ స్విఫ్ట్ టీం ఇంకా స్పందించలేదు.