
Tana: తానా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) క్రీడాకారుల కోసం వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 17న తానా బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను
నిర్వహించింది. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో పలు టీమ్‌లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. వివిధ వయస్సులు కలిగిన తెలుగు క్రీడాభిమానులు హాజరయ్యారు. సౌత్ ఈస్ట్ రీజినల్
కోఆర్డినేటర్ మధుకర్ ఈ పోటీలను తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన ఉదయ్, ఎజె అద్భుతమైన క్రీడా వేదికలు,
నిర్వహణకు సహకరించారు. చందు టోర్నమెంట్ ప్లానింగ్, లక్ష్మి ఈవెంట్ ప్రమోషన్, శశి తదితరుల సహకారంతో ఈ టోర్నమెంట్ విజయవంతమైంది. తానా నాయకులు అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, భరత్
మద్దినేని, వినయ్ మద్దినేని, కిరణ్ గోగినేని, సోహిని ఐనాల, శ్రీనివాస్ ఉప్పు, విజయ్ కొత్త, ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ నుంచి సతీష్ పునాటి, శ్యామ్ మల్లవరపు, విజయ్ కొట్ట, విష్ణు వైదన, తామా
నుంచి రాఘవ తడవర్తి, సురేష్ బండారు, సాయిరామ్ కారుమంచి, సునీల్ దేవరపల్లి, శ్రీనివాసులు రామిశెట్టి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు తానా అభిమానులు మురళి బొద్దు, సుధాకర్ బొద్దు, భాను
గుల్లపల్లి, అనిల్ చిమిలి తదితరులు హాజరుకావడం ఈవెంట్‌కు మరింత జోష్ తీసుకొచ్చింది. ఈ పోటీల్లో విజేతలకు నిర్వాహకులు ట్రోఫీలు, బహుమతులను అందజేశారు.