Kharge: పాక్‌పై చిన్నపాటి యుద్ధమన్న ఖర్గే.. మండిపడిన భాజపా

Kharge: పాక్‌పై చిన్నపాటి యుద్ధమన్న ఖర్గే.. మండిపడిన భాజపా

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వం పహల్గాంలో భద్రత కల్పించకపోవడం వల్లే అక్కడ దారుణ ఘటన చోటుచేసుకుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే


(Mallikarjuna Kharge) ఆరోపించారు. ఈ ఉగ్రదాడికి సంబంధించి ఇంటెలిజెన్స్‌ నివేదిక అందిన తర్వాతే కశ్మీర్‌ పర్యటనను ప్రధాని (Narendra Modi) రద్దు చేసుకున్నారని మరోసారి పేర్కొన్నారు. వివిధ దేశాలకు


పార్లమెంటు సభ్యుల బృందాన్ని పంపిస్తుండటంపై మాట్లాడిన ఆయన.. దీనికి సంబంధించి తమ పార్టీని ప్రభుత్వం సంప్రదించలేదని విమర్శించారు. చిన్నపాటి యుద్ధం..! ‘‘పహల్గాంలో కేంద్ర ప్రభుత్వం భద్రత


కల్పించకపోవడం వల్లే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడికి వెళ్లిన పర్యాటకులకు పోలీసులు, సరిహద్దు దళం లేదా సైన్యం సెక్యూరిటీ కల్పించలేదు. అంతమంది చనిపోయినా.. భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ


ఒక్క మాట కూడా మాట్లాడలేదు’’ అని ఖర్గే పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తైన సందర్భంగా విజయనగర జిల్లాలోని హోసాపేటలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన..


పాక్‌పై చిన్నపాటి యుద్ధాలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. పాక్‌ మనల్ని తక్కువ అంచనా వేస్తోందని, చైనా మద్దతుతో మనపై దాడులకు ప్రయత్నిస్తోందన్నారు. * నేడు జ్యోతి మల్హోత్రా.. నాడు మాధురిగుప్త


ప్రభుత్వానికి మద్దతు.. ‘‘ఇలాంటి దాడులను దేశం ఎన్నటికీ సహించదు. ఈ విషయంలో మనమంతా ఐక్యంగా ఉన్నాం. అందుకే దేశ వ్యతిరేక శక్తులపై పోరాటానికి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాం. దేశమే ముఖ్యం. ఆ


తర్వాతే మతం, కులం, మిగతావి..’’ అని ఖర్గే అన్నారు. అయితే, ప్రధాని పర్యటన వేళ నిఘా వర్గాలు సమాచారం అందిందని, సామాన్య పౌరులు, పేదలను మాత్రం రక్షించుకోలేకపోయామన్నారు. విదేశాలకు ఎంపీ బృందాలను


పంపించే అంశంపై ప్రభుత్వం తమతో సంప్రదించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అయినప్పటికీ దేశ ప్రయోజనం దృష్ట్యా తాము ఏమీ మాట్లాడలేదన్నారు. మన దేశం తరఫున మాట్లాడేందుకు కాంగ్రెస్‌


ఎంపీలను పంపిస్తున్నామని చెప్పారు. ఖర్గే వ్యాఖ్యలపై భాజపా మండిపాటు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీ సంబిత్‌ పాత్ర తిప్పికొట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌ చిన్నపాటి


యుద్ధమంటూ పేర్కొనడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యం పాకిస్థాన్‌లోకి ప్రవేశించి అక్కడి స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయాన్ని రాహుల్‌


గాంధీ, మల్లికార్జున ఖర్గేలు అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు.