
Operation sindoor: ప్లాన్డ్.. ట్రెయిన్డ్.. ఎగ్జిక్యూటెడ్.. ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ మరో వీడియో
Play all audios:

దిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే పలు
వీడియోలు షేర్ చేసిన భారత సైన్యం.. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. వీడియోలో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది,
సైనికులకు ఏ విధంగా శిక్షణనిచ్చి.. దాడులను అమలు చేసిందనే విషయాన్ని ‘ప్లాన్డ్.. ట్రెయిన్డ్.. ఎగ్జిక్యూటెడ్’ కోట్‌తో ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ అధికారులు పంచుకున్నారు. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడితో దేశ
ప్రజలలో ఆక్రోశం లావాలా పొంగింది. ఈసారి పాక్‌కు తరతరాలు గుర్తించుకునేలా గుణపాఠం నేర్పాలనే ఒకేఒక ఆలోచన సైనికుల మనసులో ఉంది. ఇది ప్రతీకార చర్య కాదు. బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయం.
ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్‌కు తగిన గుణపాఠం’’ అని వీడియోలో సైనికులు పేర్కొన్నారు. * అమెరికాకు థరూర్ బృందం.. యూకేకు రవిశంకర్ బృందం పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్
పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మే 7న దాడులు చేసింది. ఆ తర్వాత మే 9 అర్ధరాత్రి, 10వ తేదీన పాకిస్థాన్‌లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. పూర్తి
స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిపింది.