Operation sindoor: భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Operation sindoor: భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Play all audios:


భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని పలు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక


ప్రచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోంశాఖ (MHA) పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరుతో పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి


తెలిసిందే. ఈ ఆపరేషన్‌ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పలు రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఆ సమావేశంలో హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు


చేసినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి.   ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాక్‌ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది.


ఈక్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ పలు సూచనలు చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి, భారత్‌ భద్రత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే ఖాతాలపై కఠిన చర్యలు


తీసుకోవాలని ఆదేశించింది. దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆయా సోషల్ మీడియా (Social Media) ఖాతాలను వెంటనే బ్లాక్‌ చేయాలని పేర్కొంది. ఈసందర్భంగా సరిహద్దు


ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు, భద్రతా దళాలకు మధ్య కమ్యూనికేషన్‌ సంబంధాలు పెంచాలని పిలుపునిచ్చింది. * రాజస్థాన్‌లో పాక్‌ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..! మంగళవారం అర్ధరాత్రి వేళ..


పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ విరుచుకుపడింది. అక్కడి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చి పహల్గాం దాడికి భారత్‌


ప్రతీకారం తీర్చుకుంది.