Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయన

Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయన

Play all audios:


Published by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా బతికాడు. అతని జీవితంలో ఏం జరిగింది. ఎందుకు ఒంటరి అయ్యాడు. ఇంట్రస్టింగ్


స్టోరీ తెలుసుకుందాం. Real Cast Away: మీరు హాలీవుడ్ మూవీ కాస్ట్ ఎవే (cast away (2000)) చూశారా. చూడకపోతే వెంటనే చూడండి. మీ జీవితంలో చూసిన బెస్ట్ సినిమాల్లో అది ఒకటిగా మిగిలిపోతుంది. ఆ


సినిమాలో ఎలాగైతే హీరో ఓ దీవిలో ఒంటరిగా జీవిస్తాడో... అదే విధంగా... రియల్‌గా ఓ వ్యక్తి ఓ దీవిలో ఏకంగా 32 ఏళ్లు ఒంటరిగా జీవించాడు. అన్ని సంవత్సరాలైనా అతను ఆ దీవిలో ఆనందంగానే జీవించాడు.


ఎందుకంటే ఆ మధ్యధరా సముద్ర దీవి అంత అందంగా ఉంది మరి. ప్రస్తుతం అతని వయసు 81 ఏళ్లు. పేరు మారో మొరాండీ (Mauro Morandi). ఆయన్ని ఇటలీ రాబిన్‌సన్ క్రూసో అంటున్నారు. మొరాండీ... 1989లో దక్షిణ


పసిఫిక్ మహా సముద్రానికి వెళ్తుండగా... మధ్యలో బోట్ పాడైంది. దాంతో... ఈ దీవికి వచ్చిపడ్డాడు. అదే అతని ఇల్లు అయిపోయింది. ఆ దీవిని మరో పెద్దాయన కేర్ టేకర్‌గా చూసుకుంటున్నాడు. ఆయన రిటైర్


అవుతున్నాడు. ఆ విషయం తెలుసుకున్న మొరాండీ... నెక్ట్స్ తానే దాని కేర్ టేకర్ అనుకున్నాడు. తన పడవను అమ్మేశాడు. దీవిలో ఉండిపోయాడు. అక్కడే ఓ ఇల్లు కట్టుకున్నాడు. నిజానికి ఆ ఇల్లు ముందే ఉంది. రెండో


ప్రపంచ యుద్ధకాలం నాటి షెల్టర్‌ను ఇల్లుగా చేసుకున్నాడు. మొరాండీ జీవించిన దీవి (IMAGE CREDIT - TWITTER - CNN) advertisement 32 ఏళ్లుగా ఆ దివిలోనే ఉంటున్న మొరాండీ... అలా జీవించేందుకు నానా


కష్టాలు పడ్డాడు. ప్రకృతి విలయాలతో పోరాడాడు. దీవి అందం చెడిపోకుండా కాపాడాడు. ఐతే... 2016లో ఆ దీవిలో అతను ఉన్న విషయం తెలిసింది. ఆ దీవిని అతను ఖాళీ చెయ్యాలంటూ... లా మద్దలేనా ఆర్చిపెలాగో నేషనల్


పార్క్ నోటీస్ పంపింది. దాంతో న్యాయపోరాటం మొదలైంది. తాజాగా కోర్టు కూడా ఆ దీవి పార్కుకే చెందినదని తేల్చింది. అతన్ని ఖాళీ చెయ్యమని చెప్పింది. ఐతే... ఐదేళ్లుగా మొరాండీకి మద్దతుగా చాలా మంది


పిటిషన్‌పై సంతకాలు చేశారు. అధికారులు మాత్రం అతను ఖాళీ చెయ్యాల్సిందేనని పట్టుపట్టారు. advertisement 81 ఏళ్ల మొరాండీ తాజాగా తన న్యాయపోరాటాన్ని ముగించాడు. "32 ఏళ్ల తర్వాత ఈ దీవిని వదిలి


వెళ్లడం బాధగా ఉంది. నేను ఒకప్పుడు మెయిన్ టౌన్‌కి శివార్లలో ఉండేవాణ్ని. ఇప్పుడు అక్కడికే వెళ్లి... షాపింగ్ చేసి బట్టలు కొనుక్కుంటా. నా జీవితాన్ని జీవిస్తా. నా జీవితంలో పెద్దగా మార్పేమీ రాదు.


ఇకపైనా నేను సముద్రాన్ని చూస్తాను" అని మొరాండీ తెలిపాడు. Location : First Published : April 28, 2021 12:05 PM IST Read More