Drone like objects: రాత్రి వేళ కోల్‌కతాలో డ్రోన్ల లాంటి వస్తువుల కలకలం.. పోలీసుల అప్రమత్తం

Drone like objects: రాత్రి వేళ కోల్‌కతాలో డ్రోన్ల లాంటి వస్తువుల కలకలం.. పోలీసుల అప్రమత్తం

Play all audios:


కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ఇటీవల రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు (Drone like objects) కనిపిస్తుండటం కలకలం రేపింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త


పరిస్థితుల నేపథ్యంలో నగర (Kolkata) పోలీసులు ఈ ఘటనపై అప్రమత్తమయ్యారు. గూఢచర్యంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని హేస్టింగ్స్‌ ప్రాంతం, విద్యాసాగర్‌


సేతు తదితర ప్రాంతాల్లో దాదాపు 10 డ్రోన్ల లాంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నివేదిక అందిందని.. దర్యాప్తు కొనసాగుతోందని రక్షణ శాఖ అధికారులు


చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై కేంద్రం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. * అమెరికా రక్షణకు బంగారు కవచం.. ఏమిటీ గోల్డెన్‌ డోమ్‌..? ఈ డ్రోన్లను


పోలిన వస్తువుల కదలికలను హేస్టింగ్‌ పోలీసుస్టేషన్‌ పోలీసులు మొదట గుర్తించారు. వీటికి డ్రోన్లతో పోలికలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని మహేస్థల వైపు నుంచి ఇవి వచ్చాయని


తెలిపారు. ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌, కోల్‌కతా డిటెక్టివ్‌ విభాగాలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయని వెల్లడించారు. ఈ డ్రోన్లు ఎవరికి సంబంధించినవి? వీటితో ఎవరైనా గూఢచర్యానికి పాల్పడుతున్నారా?


అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని అధికారులు తెలిపారు.