Pm modi: త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్‌ మీటింగ్‌

Pm modi: త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్‌ మీటింగ్‌

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈనేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం త్రివిధ దళాధిపతులతో


ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. ఇందులో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కూడా ఉన్నారు. కొన్ని గంటల ముందే భారత


జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ సైతం మోదీతో భేటీ అయ్యారు. భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డోభాల్‌ వరుసగా ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. పహల్గాంలో పర్యాటకులపై


జరిగిన ఉగ్ర దాడితో భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈక్రమంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation sindoor) పేరుతో పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత్‌ ఆర్మీ దాడులు చేసింది. ఈ


దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి.