
Neeraj chopra: నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదా
Play all audios:

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra)కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత
నీరజ్ చోప్రా (Neeraj Chopra)కు అరుదైన గౌరవం దక్కింది. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను ప్రదానం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఇది ఏప్రిల్ 16, 2025
నుంచి అమల్లోకి వస్తుందని అధికారిక ప్రకటనలో తెలిపింది. నీరజ్ చోప్రా గతంలో భారత సైన్యంలో సుబేదార్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర
సృష్టించాడు. అనంతరం ఇతడిని కేంద్ర ప్రభుత్వం ‘పరమ విశిష్ట సేవా పతకం’తో సత్కరించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాన్ని 2021లో అందుకున్న నీరజ్
చోప్రా.. 2022లో పద్మశ్రీ అవార్డును స్వీకరించాడు. గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఈ బల్లెం వీరుడు రజత పతకం సొంతం చేసుకున్నాడు. నీరజ్ మే 16న దోహా డైమండ్ లీగ్‌లో, జూన్ 24న ఒస్ట్రావా
గోల్డెన్ స్పైక్ 2025 అథ్లెటిక్స్ మీట్‌లో పోటీపడనున్నాడు. నీరజ్ కంటే ముందు పలువురు సెలబ్రిటీలు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి అధికారులుగా ఉన్నారు. ఈ జాబితాలో స్టార్ నటుడు
మోహన్ లాల్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సచిన్ పైలట్, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా ఉన్నారు.